
యాంకర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అనసూయ సినిమాల్లో కూడా సత్తా చాటుతుంది. సినిమాల్లో చేసేది చిన్న పాత్ర అయినా కూడా ఆమె చాలా స్పెషల్ గా ఉండాలని చూస్తుంది. కృష్ణవంశీ డైరక్షన్ లో రంగమార్తాండ సినిమాలో ఆమె స్పెషల్ రోల్ చేస్తుందని తెలుస్తుంది. ఇక ఇదే కాకుండా అనసూయ సిల్క్ స్మిత బయోపిక్ లో నటిస్తుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.
కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతితో అనసూయ కలిసి దిగిన ఫోటో వైరల్ గా మారడంతో ఆమె సిల్క్ స్మిత పాత్ర చేస్తుందని వార్తలు వచ్చాయి. అయితే సిల్క్ స్మిత జీవిత కథలో తాను నటిస్తున్న వార్తలను ఖండించింది అనసూయ తాను ఎవరి జీవిత కథలో నటించట్లేదని ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.
I am NOT playing #SilkSmita garu in any biopic. Thank you. 🙂