పూరీ జనగణమన హీరో మారాడా..?

సూపర్ స్టార్ మహేష్, డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ ఇద్దరు కలిసి హ్యాట్రిక్ మూవీగా జనగణమన చేస్తారని అన్నారు. టైటిల్ పోస్టర్ తో పూరీ అప్పట్లో తెగ హడావిడి చేశాడు. అయితే ఆ తర్వాత ఎందుకో ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లలేదు. అయితే పూరీ ఈ సినిమాను మహేష్ తో కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేయాలని చూస్తున్నారట. పవర్ స్టార్ తో బద్రి సినిమాతో డైరక్టర్ గా మారిన పూరీ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకుని ఆ తర్వాత పవన్ తో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా చేశాడు.

ఈ ఇద్దరి కాంబోలో మూడవ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పూరీ జనగణమన పవన్ కళ్యాణ్ తో తీస్తాడని లేటెస్ట్ టాక్. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్న పూరీ ఆ సినిమా తర్వాత జనగణమన చేస్తాడని టాక్. అయితే పవన్ తో సినిమా ఓకే చేసుకున్నా ఇప్పుడప్పుడే మాత్రం ఆ సినిమా చేసే ఛాన్స్ లేదని చెప్పొచ్చు.