వరుణ్ తేజ్ సూపర్ డిమాండ్..!

లాస్ట్ ఇయర్ ఎఫ్2, గద్దలకొండ గణేష్ సినిమాలతో హిట్ అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో బాక్సర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ ఎఫ్3 సినిమాలో చేస్తున్నాడని తెలిసిందే. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన ఎఫ్2 సూపర్ సక్సెస్ అవగా ఆ సినిమా సీక్వల్ లో కూడా వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ 13 కోట్ల దాకా డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది.

నిర్మాత దిల్ రాజు వరుణ్ తేజ్ తో బేరసారాలు ఆడి ఫైనల్ గా 8 కోట్లకు డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. అయితే 8 కోట్ల రెమ్యునరేషన్ మాత్రమే కాదు సినిమా లాభాల్లో షేర్ కూడా ఇస్తానని చెప్పాడట. మొత్తానికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన మెగా మేనియా కొనసాగిస్తున్నాడని చెప్పొచ్చు. బాక్సర్ హిట్ అయితే వరుణ్ తేజ్ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.