రాధే శ్యామ్ డెడ్ లైన్ ఫిక్స్..!

సాహో తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా రాధే శ్యాం. ఈ సినిమా ను జిల్ ఫేం రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. పిరియాడికల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్స్ అన్ని సినిమాపై అంచనాలు పెంచాయి. సినిమాలో విక్రమాదిత్య గా ప్రభాస్.. ప్రేరణగా పూజా హెగ్దే నటిస్తుంది. 

200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డిసెంబర్ 25 క్రిస్మస్ కల్లా పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టాడట ప్రభాస్. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ అనుకున్న టైం లో సినిమాలను పూర్తి చేయాలని చూస్తున్నాడు. అందులో భాగంగానే రాధే శ్యాం క్రిస్మస్ కల్లా పూర్తి చేసి 2021 జనవరిలో ఆదిపురుష్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు.