'మెగా' సంగీత్ లో.. 'మెగా' హీరోల సందడి..!

మెగా ఫ్యామిలీ అంతా రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో సందడి చేస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి వేడుక సందర్భంగా మెగా ఫ్యామిలీ మొత్తం ఉదయ్ పూర్ కు షిఫ్ట్ అయ్యారు. డిసెంబర్ 9న జరిగే పెళ్లి వేడుకకు ముందు రోజు ఏర్పాటు చేసిన సంగీత్ లో మెగా హీరోలంతా తమ డ్యాన్స్ తో అలరించినట్టు తెలుస్తుంది. 

చిరు పాటతో పాటుగా మెగా హీరోల అందరి పాటలు ప్లే చేసి అక్కడ వారంతా డ్యాన్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సంగీత్ వేడుకలో నిహారిక, చైతన్యలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారని తెలుస్తుంది. చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయి ధరం తేజ్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్ ఇలా మెగా హీరోలంతా ఈ సంగీత్ లో ఆడిపడినట్టు తెలుస్తుంది. చిరు, నాగబాబు పెళ్లి వేడుకలతో బిజీగా ఉన్నారని తెలుస్తుంది. ఇక సాయంత్రానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉదయ్ పూర్ చేరుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరి మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక మరింత ఘనంగా జరిగేలా చేస్తున్నారు.