
ఈమధ్య కాలంలో తెలుగు యువతకు బాగా దగ్గరైన హీరో విజయ్ దేవరకొండ. అంతకుముందు పెళ్లిచూపులు సూపర్ హిట్ అయినా ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆ సినిమానే విజయ్ దేవరకొండకు మంచి క్రేజ్ వచ్చేలా చేసింది. సందీప్ వంగ డైరక్షన్ లో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండను స్టార్ హీరో చేసింది.
ఈ సినిమా తర్వాత విజయ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇక సందీప్ వంగ కూడా అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసి హిట్ అందుకున్నాడు. హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ గా అర్జున్ రెడ్డి 2ని చేసే ప్లాన్ లో ఉన్నాడట సందీప్ వంగ. విజయ్ దేవరకొండతోనే అర్జున్ రెడ్డి 2 సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఫైటర్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి 2ని కూడా పాన్ ఇండియా రేంజ్ లో చేయాలని చూస్తున్నారట.