
మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం రాజమౌళి డైరక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రాం చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో కూడా నటిస్తున్నాడు చరణ్. చిరు ఆచార్యలో చరణ్ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో వచ్చే చరణ్ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు.
ఆచార్య డైరక్టర్ కొరటాల శివ ముందు చరణ్ పాత్రని 10 నిమిషాలే అనుకోగా బాగా వస్తుండటంతో చరణ్ పాత్ర పొడిగించినట్టు తెలుస్తుంది. ఎలాగు చిరు సినిమా కాబట్టి చరణ్ పాత్ర పెంచినా ఎలాంటి అబ్జెక్షన్ లేదు. అందుకే చిరు ఆమోదంతో 10 నిమిషాలు అనుకున్న చరణ్ పాత్ర 30 మినిట్స్ చేశారట. సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ ముందు వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చరణ్ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టేస్తాడని అంటున్నారు.