ఉప్పెన సాంగ్ రికార్డ్ వ్యూస్..!

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెన రిలీజ్ కు రెడీగా ఉంది. సుకుమార్ అసిస్టెంట్ బుచ్చి బాబు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ప్రచార చిత్రాలు సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చాయి. ఇక సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ హైలెట్ గా నిలిచేలా ఉన్నాయి. ఉప్పెనలో నీ కన్ను నీలి సముద్రం పాట యువతకి బాగా నచ్చేసింది.

అందుకే ఆ సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ సాధించింది. 1, 10 కాదు ఏకంగా 150 మిలియన్ వ్యూస్ తో రికార్డ్ సృష్టించింది ఉప్పెన సాంగ్. స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే సాధ్యమయ్యే ఈ వ్యూ కౌంట్ మొదటి సినిమా పాటకి అందుకోవడం ఓ విధంగా వైష్ణవ్ తేజ్ లక్కీ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో హీరోయిన్ కృతి శెట్టికి సినిమా రిలీజ్ అవకుండానే వరుస ఛాన్సులు వస్తున్నాయి. వైష్ణవ్ తేజ్ కూడా క్రిష్ డైరక్షన్ లో తన సెకండ్ సినిమాను కూడా పూర్తి చేశాడు.