
సాధారణంగా పెళ్లి తర్వాత ఏ హీరోయిన్ కు అయినా కెరియర్ దాదాపు ముగుస్తుంది. కనీసం గ్రాఫ్ అయినా తగ్గుతుంది కాని అక్కినేని కోడలు సమంతకు అది రివర్స్ లో జరుగుతుంది. పెళ్లి తర్వాత కూడా సమంత మునుపటి ఫాం కొనసాగిస్తుంది. సినిమాలతోనే కాదు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో కూడా సమంత సత్తా చాటుతుంది. ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సీరీస్ లో నటించిన సామ్ లేటెస్ట్ గా ఆహాలో సామ్ జామ్ షో హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
ఆ షోలో తారల పర్సనల్, ప్రైవేట్ విషయాలతో సమంత స్పెషల్ చిట్ చాట్ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక సమంత షోకి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. ఆమధ్య సోషల్ మీడియాలో ఈ పిక్స్ వైరల్ అయ్యాయి. అయితే సామ్ జామ్ సమంత చిరు స్పెషల్ చిట్ చాట్ క్రిస్మస్ రోజున టెలికాస్ట్ చేస్తారట. అదే ఆహాలో డిసెంబర్ 25న అప్లోడ్ చేస్తారని తెలుస్తుంది. ఈ లాక్ డౌన్ టైం లో 100 పర్సెంట్ తెలుగు ఓటిటిగా ఆహా ఆడియెన్స్ చేత నిజంగానే ఆహా అనిపించుకుంది. సమంత సామ్ జామ్ షోకి మంచి రెస్పాన్స్ వస్తుంది.