
టాలెంటెడ్ డైరక్టర్ హను రాఘవపుడి డైరక్షన్ లో మళయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. స్వప్నా సినిమాస్ బ్యానర్ లో ప్రియాంకా దత్, స్వప్నా దత్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. పిరియాడికల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మదన్నని సెలెక్ట్ చేయాలని అనుకున్నారు కాని రష్మిక ఆ ఛాన్స్ కాదని చెప్పిందట.
డేట్స్ అడ్జెస్ట్ అవ్వకనే రష్మిక ఈ సినిమా ఆఫర్ రిజెక్ట్ చేసిందని తెలుస్తుంది. అయితే సినిమాలో పూజా హెగ్దే కూడా ఒక హీరోయిన్ గా చేస్తుందని వార్తలు వచ్చాయి.. ఆ కారణంగానే రష్మిక ఈ సినిమాని వదులుకుందని అంటున్నారు. రష్మిక కాదన్న ఈ సినిమాను రాశి ఖన్నా ఓకే చేసిందని తెలుస్తుంది. తెలుగులో యువ హీరోల సరసన నటిస్తున్న రాశి ఖన్నా కోలీవుడ్ లో కూడా వరుస ఛాన్సులు అందుకుంటుంది. దుల్కర్ సల్మాన్ సినిమాను తెలుగుతో పాటుగా తమిళ, మళయాళ భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.