రామ్ వీరపనేనితో సింగర్ సునీత ఎంగేజ్మెంట్..!

కొన్నాళ్లుగా వార్తల్లో ఉన్న సింగర్ సునీత రెండో పెళ్లి వార్తకు ఈరోజు ఒక సమాధానం దొరికింది. టాలీవుడ్ పాపులర్ సింగర్ సునీత డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనితో రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. రామ్, సునీతల ఎంగేజ్మెంట్ సోమవారం కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరిగింది. సునీత ఈ విషయాన్ని రివీల్ చేస్తూ ఇన్ స్టాగ్రాంలో షేర్ చేశారు. కొన్నాళ్లుగా మొదటి భర్తకు దూరంగా ఉంటున్న సునీత అతని నుండి విడాకులు తీసుకున్నారు. రామ్ తో ఎంగేజ్ అయిన సునీత త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నాం అంటూ సోషల్ మీడియాలో వెల్లడించారు.