
ఆరెక్స్ 100 సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న డైరక్టర్ అజయ్ భూపతి తన సెకండ్ సినిమా కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. మహా సముద్రం కథతో చాలామంది హీరోల దగ్గరకు వెళ్లిన అజయ్ భూపతి ముందు ఓకే అనిపించుకున్నా తర్వాత వర్క్ అవుట్ అవలేదు. ఫైనల్ గా శర్వానంద్ తో మహా సముద్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో బొమ్మరిల్లు సిద్ధార్థ్ కూడా నటిస్తున్నాడు. శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ గా మహా సముద్రం భారీ అంచనాలతో వస్తుంది.
ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ ఒక హీరోయిన్ గా నటిస్తుండగా.. అదితి రావు హైదరి కూడా సెకండ్ హీరోయిన్ గా చేస్తుంది. అయితే తన సినిమాలో హీరోయిన్స్ కు నెగటివ్ టచ్ ఇవ్వాలని అనుకున్నాడో ఏమో కాని మహా సముద్రం సినిమాలో కూడా అదితి రావు హైదరి కొన్ని నెగటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలో కనిపిస్తుందని అంటున్నారు. తప్పకుండా మహా సముద్రంతో తనని కాదని చెప్పిన హీరోలందరికి సూపర్ ఆన్సర్ ఇవ్వాలని చూస్తున్నాడు అజయ్ భూపతి. మరి అది ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి.