2021.. RRR ట్రైలర్ తో మొదలు..!

2020 ప్రపంచం మొత్తం భయపడేలా చేసింది కరోనా. అయితే ఇప్పుడిప్పుడే అన్ని పరిశ్రమలు వారి నష్టాలను లెక్కలేసుకుని బిజినెస్ లు ప్రారంభించాయి. అన్నిటితో పాటుగా సినీ పరిశ్రమ కూడా కరోనా వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని చూస్తుంది. సినిమా షూటింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అవగా సినిమా రిలీజ్ లకు ముహుర్తాలు పెట్టేస్తున్నారు. ఇక ఇదిలాఉంటే సినిమా సందడి మొదలవ్వాలంటే స్టార్ సినిమాల టీజర్, ట్రైలర్ రిలీజ్ హంగామా ఉండాల్సిందే.

అందరు ఏమో కాని 2020కు గుడ్ బై చెప్పి.. 2021కి గ్రాండ్ వెల్కం చెప్పబోతుంది ట్రిపుల్ ఆర్ టీం. న్యూ ఇయర్ రోజునే ఆర్.ఆర్.ఆర్ టీజర్ ను రిలీజ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమా ఈమధ్య వచ్చిన రెండు టీజర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. 2021 ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ తోనే మొదలు పెడతారని టాక్. అందుకోసం రాజమౌళి ట్రైలర్ కు భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.