బాలకృష్ణ 'బలరామయ్య బరిలోకి దిగితే'

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ ఇంకా రాలేదు. త్వరలోనే సినిమాకు సంబందించిన డీటైల్స్ వెళ్లడిస్తారని తెలుస్తుంది. ఇదిలాఉంటే ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు బి.గోపాల్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమా త్వరలో స్టార్ట్ అవుతుందని టాక్.

ఇదే కాకుండా మస్కా, కందిరీగ డైరక్టర్ సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో బాలకృష్ణ సినిమా ఉంటుందని టాక్. ఇప్పటికే బాలకృష్ణకు కథ వినిపించడం ఆయన ఓకే చేయడం జరిగిందట. ఈ సినిమాకు టైటిల్ గా బలరామయ్య బరిలోకి దిగితే అని టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తుంది. జనవరిలో ఈ సినిమా అఫీషియూల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు. బాలయ్య బాబు బలరామయ్యలా మారితే నందమూరి ఫ్యాన్స్ కు పండుగే అని చెప్పొచ్చు.