జాంబీ రెడ్డి టీజర్..!

అ! సినిమాతో టాలెంట్ చూపించిన డైరక్టర్ ప్రశాంత్ వర్మ సెకండ్ సినిమా కల్కితో కమర్షియల్ గా హిట్ కొట్టలేదు కాని విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక తన థర్డ్ మూవీ జాంబీ రెడ్డిని తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. తెలుగులో వస్తున్న తొలి జాంబీ మూవీగా ఈ సినిమా క్రేజ్ తెచ్చుకుంది. ఇక జాంబీ రెడ్డి సినిమా ఫస్ట్ లుక్ టీజర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. 

కరోనా వైరస్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో దైవం, సైన్స్ ఇలా అన్ని అంశాలను ప్రస్థావించినట్టు తెలుస్తుంది. సినిమా టీజర్ లో విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అలరించింది. జాంబీ రెడ్డి టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి. తేజా సజ్జా, ఆనంది, దక్ష నటిస్తున్న ఈ మూవీని రాజ శేఖర్ వర్మ నిర్మిస్తున్నారు.