చిరు ఇంట్రో సాంగ్.. ఆ మాత్రం పెట్టకపోతే ఎలా..?

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ ఆచార్య. ఈ సినిమాను మ్యాట్నీ మూవీ బ్యానర్ లో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాం చరణ్ కూడా ఒక నటిస్తున్న విషయం తెలిసిందే. ఈమధ్యనే మళ్ళీ షూటింగ్ ప్రారంభించిన చిత్రయూనిట్ చిరు ఇంట్రో సాంగ్ కోసం భారీ సెట్ వేసినట్టు తెలుస్తుంది. ఈ సెట్ కోసం దాదాపు 20 కోట్ల దాకా ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది.

ఎంట్రీ సాంగ్ కే ఆ రేంజ్ లో ఖర్చా అని అవాక్కవ్వొచ్చు. చిరు ఇంట్రో సాంగ్ అంటే భారీగా ఉండాలి కదా అందుకే ఈ సెట్ వేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సెట్ లో మరికొన్ని సీన్స్ కూడా షూట్ చేస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కాజల్ ఒక హీరోయిన్ గా నటిస్తుండగా చరణ్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తుందని టాక్. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2021 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.