
సూర్య హీరోగా సుధ కొంగర డైరక్షన్ లో వచ్చిన సినిమా సూరారై పొట్రు. తెలుగులో ఆకాశం నీ హద్ధురాగా రిలీజైంది. నవంబర్ 12న అమేజాన్ ప్రైం లో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ముందు ఈ సినిమా ఓటిటి రిలీజ్ పై డౌట్ పడ్డ తమిళ ఆడియెన్స్ సినిమా రిలీజ్ తర్వాత సూపర్ అనేశారు. ఈ సినిమా రిలీజ్ విషయంలోనే సూర్యతో థియేటర్ యాజమాన్యాల సంఘాలకు గొడవ జరిగింది. సూర్య సినిమాలను ఇక మీదట థియేటర్ లో రిలీజ్ చేసేది లేదని వారు హెచ్చరించారు.
ఇదిలాఉంటే సూర్య ఆకాశం నీ హద్దురా సినిమా చూసిన సెలబ్రిటీస్ కూడా తన స్పందన తెలియచేశారు. ఇక లేటెస్ట్ గా స్టార్ హీరోయిన్ సమంత.. అక్కినేని కోడలు ఈ సినిమాపై స్పెషల్ ట్వీట్ చేసింది. ఇంతకీ సమంత ఏం ట్వీట్ చేసింది అంటే ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ సూరారై పొట్రు.. హీరో సూర్య, హీరోయిన్ అపర్ణ బాలమురళీ నటన సూపర్.. సుధ కొంగర డైరక్షన్ కు ఫిదా అయినట్టు సమంత తెపిపారు. ఈ సినిమా రిలీజ్ చేసిన అమేజాన్ ప్రైం ను కూడా సమంత అభినందించింది. ఇలాంటి స్పూర్తిదాయక సినిమా కోసమే ఎదురుచూస్తున్నానని సమంత ట్విట్టర్ లో పేర్కొన్నారు. సమంత చేసిన ట్వీట్ కు అపర్ణా బాలమురళి థ్యాంక్స్ అని రిప్లై ఇచ్చారు
Film of the year #SooraraiPottru . What a gem 🔥.. @Suriya_offl 🙏🙏🙏 #SudhaKongara ❤️❤️❤️ @Aparnabala2 🌸.. @PrimeVideoIN .. Outstanding .. just the inspiration I needed 😭 pic.twitter.com/0BCCc2SmQm