రానా 'హిరణ్యకశ్యప' క్రేజీ అప్డేట్..!

దగ్గుబాటి రానా, గుణ శేఖర్ కాంబినేషన్ లో హిరణ్యకశ్యప సినిమా ఉంటుందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ చేసే సినిమా ఇదే అని అనుకున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ లో 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా వస్తుందని అన్నారు. అయితే ఈ సినిమా ఎందుకో వెనకపడ్డది. రానా సినిమా పక్కన పెట్టి శాకుంతలం సినిమా తెరకెక్కిస్తున్నాడు గుణశేఖర్. 

అయితే రానా సినిమా క్యాన్సిల్ అయ్యిందని అనుకున్నారు కాని గుణశేఖర్ తో హిరణ్యకశ్యప సినిమాపై రానా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడట. ప్రస్తుతం కమిటైన సినిమాలన్ని పూర్తి చేసి 2022లో ఈ సినిమా చేస్తారని టాక్. మొత్తానికి క్యాన్సిల్ అనుకున్న హిరణ్యకశ్యప సినిమా ఉంటుందని చెప్పి దగ్గుబాటి ఫ్యాన్స్ ను ఖుషి అయ్యేలా చేశారు.