పవర్ స్టార్ మరో అభిమానికి ఛాన్స్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలంటే అదిరిపోయే కథ.. ప్రేక్షకులను మెప్పించే టాలెంట్ ఇవన్ని ఉండాల్సిందే. వీటికన్నా చాలా ముఖ్యమైనది పవర్ స్టార్ అంటే అభిమానం. తనని అభిమానించే వారికే పవన్ ఛాన్సులు ఇస్తుంటాడు. అఫ్కోర్స్ హీరోని అభిమానించి తమ హీరోని ఇలా చూపించాలని అనుకుని కథ రాసుకుంటారు కాబట్టి అందులో తప్పుగా అర్ధం చేసుకోవాల్సింది ఏమి లేదు. పవర్ స్టార్ తో సినిమాలు చేసే ఈమధ్య కాలం దర్శకులంతా ఆయన అభిమానులే అని చెబుతుంటారు.

లేటెస్ట్ గా ఈ జాబితాలో మరో డైరక్టర్ చేరుతున్నాడు. డ్యాన్స్ మాస్టర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న జానీ మాస్టర్ పవర్ స్టార్ కు, రాం చరణ్ కు వీరాభిమాని.. మెగా హీరోలకు ఆయన స్పెషల్ గా డ్యాన్స్ కంపోజ్ చేస్తుంటాడు. అయితే ఇప్పుడు ఈ క్రేజీ డ్యాన్స్ మాస్టర్ డైరక్టర్ గా మారుతున్నాడని తెలుస్తుంది. పవర్ స్టార్ కోసం ఓ అద్భుతమైన కథ రెడీ చేశాడత జానీ మాస్టర్. పవన్ ను కలిసి కథ వినిపిస్తే ప్రొసీడ్ అనేశాడట. ఈ సినిమాను చరణ్ నిర్మిస్తాడని టాక్. అదే జరిగితే పవర్ స్టార్ అభిమాని డైరెక్ట్ చేసే ఈ సినిమా పవర్ స్టార్ రియల్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి అయ్యేలా చేస్తుందని చెప్పొచ్చు.