
నాచురల్ స్టార్ నాని నిర్మాతగా శైలేష్ కొలను డైరక్షన్ లో వచ్చిన సినిమా హిట్. క్రైం థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమాలో ఫలనుమా దాస్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. మొదటి సినిమానే అయినా విశ్వక్ సేన్ తన ప్రతిభ చాటాడు. సినిమా సీక్వల్ ఉంటుందని క్లూ ఇచ్చి ఎండ్ కార్డ్ వేశారు. కొద్దిపాటి గ్యాప్ తో శైలేష్ హిట్ పార్ట్ 2 స్క్రిప్ట్ రెడీ చేశాడని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో హీరోగా విశ్వక్ సేన్ నటించడం కష్టమే అంటున్నారు. విశ్వక్ సేన్ ప్లేస్ లో అడివి శేష్ ఈ సినిమాలో నటిస్తాడని టాక్. అడివి శెష్ కు ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చేసిన అనుభవం బాగా ఉంది. హిట్ 2లో అడివి శేష్ అయితే సినిమాపై అంచనాలు కూడా పెరుగుతాయి. ప్రస్తుతం మేజర్, గూఢచారి 2 సినిమాలు చేస్తున్న అడివి శెష్ హిట్ 2లో నటిస్తాడా లేదా అన్నది అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. అయితే విశ్వక్ సేన్ ప్లేస్ లో అడివి శెష్ నటిస్తాడా లేక ఇద్దరు యువ హీరోలు ఈ సినిమాలో ఉంటారా అన్నది కూడా త్వరలో తెలుస్తుంది.