
డిస్ట్రిబ్యూటర్, నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నిలదొక్కుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. సినిమా కంటెంట్ ఎలా ఉన్నా బడ్జెట్, హీరోయిన్స్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవడు ఈ యువ హీరో. అందుకే మొదటి సినిమాలోనే సమంత, తమన్నాలతో రొమాన్స్ చేశాడు. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ అందరితో బెల్లంకొండ బాబు రొమాన్స్ చేశాడు.
తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకోవడంలో వెనకపడ్డ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. తెలుగులో సూపర్ హిట్టైన ఛత్రపతి సినిమా రీమేక్ తో బాలీవుడ్ లోకి వెళ్తున్నాడు బెల్లంకొండ హీరో. రాజమౌళి డైరక్షన్ లో వచ్చిన ఛత్రపతి సినిమాలో ప్రభాస్ హీరోగా నటించాడు. ఆ సినిమా తర్వాత ప్రభాస్ ఇమేజ్ డబుల్ అయ్యిందని చెప్పొచ్చు. ఇక లేటెస్ట్ గా ఇదే సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. వినాయక్ ఈ రీమేక్ ను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ రీమేక్ లో ప్రస్తుతం అక్కడ సూపర్ ఫాం లో ఉన్న కియరా అద్వానిని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు. మరి తెలుగులో ఛాన్సులు వచ్చినా డేట్స్ ఖాళీ లేవని చెబుతున్న కియరా అద్వాని బాలీవుడ్ ఛత్రపత్కి సైన్ చేస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఎలాగైనా కియరాని ఒప్పించి తెలుగులో వచ్చిన రిజల్ట్ ను అక్కడ రిపీట్ చేయాలని చూస్తున్నాడు బెల్లంకొండ హీరో.