ఎన్.టి.ఆర్ తో కె.జి.ఎఫ్ డైరక్టర్..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో తారక్ కనిపిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రం డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నెల్ తో తారక్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడని తెలుస్తుంది. కె.జి.ఎఫ్ తో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం చాప్టర్ 2ని తెరకెక్కిస్తున్నాడు. 

కె.జి.ఎఫ్ పార్ట్ 2 రిలీజ్ తర్వాత 2021 సెకండ్ హాఫ్ నుండి తారక్ సినిమా చేస్తాడని టాక్. ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా వస్తుందని తెలుస్తుంది. ఇండియా నుండి పాకిస్తాన్ విడిపోయిన నాటి కథతో ఈ సినిమా వస్తుందని టాక్. ఇండో పాక్ యుద్ధం నేపథ్యంతో ఈ సినిమా కథ ఇప్పటికే సిద్ధం చేశాడట ప్రశాంత్ నీల్. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది.