క్రిస్ మస్ కు మెగా మేనల్లుడు సినిమా..!

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా నూతన దర్శకుడు సుబ్బు డైరక్షన్ లో వస్తున్న సినిమా సోలో బ్రతుకే సో బెటర్. మొన్నటిదాకా ఫ్లాపుల్లో ఉన్న సాయి ధరం తేజ్ లాస్ట్ ఇయర్ చిత్రలహరి, ప్రతిరోజూ పండుగే సినిమాతో హిట్ అందుకున్నాడు. సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను కూడా డిసెంబర్ 25న రిలీజ్ ఫిక్స్ చేశారు. 

కరోనా లాక్ డౌన్ తర్వాత థియేటర్లు మూతపడగా రీసెంట్ గా తెలంగాణా సిఎం కె.సి.ఆర్ సినీ పరిశ్రమకు, థియేటర్ యాజమాన్యాలకు వరాల జల్లు కురిపించారు. త్వరలోనే థియేటర్లు ఓపెన్ అవుతాయని తెలుస్తుంది. అయితే డిసెంబర్ 25న సాయి ధరం తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా రిలీజ్ అవబోతుంది. క్రిస్ మస్ కానుకగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు.

ప్రచార చిత్రాలు, సినిమా నుండి రిలీజైన సాంగ్స్ కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సాయి ధరం తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా కూడా తేజ్ హిట్ మేనియా కొనసాగిస్తుందో లేదో చూడాలి. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.