
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. సూపర్ హిట్లు కొడుతూ సూపర్ ఫాంలో ఉన్న విజయ్ సినిమా అంటే అక్కడ ఫ్యాన్స్ కు పండుగ అన్నట్టే. ప్రస్తుతం దళపతి విజయ్ మాస్టర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ పై కన్ ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. ఈమధ్యనే రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.
విజయ్ సినిమా ఓటిటి రిలీజ్ అవుతుందని.. ఓటిటితో 100 కోట్ల డీల్ కుదుర్చుకుందని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై చిత్రయూనిట్ స్పందించింది. మాస్టర్ సినిమా 100 కోట్ల డీల్ ఏమి లేదని.. ఎప్పటికైనా సినిమా థియేటర్ లోనే రిలీజ్ చేస్తామని నిర్మాత క్లారిటీ ఇచ్చారు. టీజర్ తో రికార్డ్ వ్యూస్ రాబట్టి విజయ్ మాస్టర్ సినిమా ఎప్పటికైనా సరే థియేటర్ లోనే సందడి చేస్తుందని అంటున్నారు.
ఖైది సినిమాతో సూపర్ హిట్ అందుకున్న లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. విజయ్ సరసన మాళవిక మోహనన్, ఆండ్రియా హీరోయిన్స్ గా నటించగా అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు.