సంబంధిత వార్తలు

సూపర్ స్టార్ మహేష్ మరో అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నారు. ట్విట్టర్ లో 11 మిలియన్ ఫాలోవర్స్ తో సూపర్ స్టార్ దూసుకెళ్తుండగా ఇన్ స్టాగ్రాంలో 6 మిలియన్ ఫాలోవర్స్ ను సాధించాడు మహేష్. సినిమాలే కాదు వాణిజ్య ప్రకటనలతో కూడా మహేష్ సత్తా చాటుతున్నాడు. యాడ్స్ మహేష్ కు సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా సూపర్ ఫాలోయింగ్ ఏర్పడేలా చేస్తున్నాయి.
ఇన్ స్టాగ్రాం లో మహేష్ 6 మిలియన్ ఫాలోవర్స్ తో అరుదైన రికార్డ్ అందుకున్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది.