బన్నీ మూవీ కొరటాల షాకింగ్ రెమ్యునరేషన్..!

రైటర్ గా సూపర్ హిట్లు అందుకుని డైరక్టర్ గా సూపర్ హిట్ ఫాం కొనసాగిస్తున్నాడు కొరటాల శివ. మిర్చి నుండి భరత్ అనే నేను వరకు వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా చేస్తున్నాడు కొరటాల శివ. 2021 సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. చిరుతో పాటుగా రాం చరణ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే.

ఆచార్య తర్వాత కొరటాల శివ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను 2021 సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అయ్యి 2022లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు కొరటాల శివ 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. బన్నీతో కొరటాల శివ కాంబో మరో సెన్సేషనల్ మూవీని అందిస్తుందని మెగా అల్లు ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు.