
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తర్వాత లూసిఫర్ రీమేక్ చేస్తాడని తెలుస్తుంది. మళయాళంలో సూపర్ హిట్టైన ఈ సినిమాను తెలుగులో చిరు రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఈ రీమేక్ ను మొదట సాహో డైరక్టర్ సుజిత్ డైరెక్ట్ చేస్తాడని వార్తలు రాగా అతను తప్పుకుని ఆయన ప్లేస్ లో వినాయక్ వచ్చాడు. చిరుతో వినాయక్ చేసిన రెండు రీమేక్ లు సూపర్ హిట్ అయ్యాయి. అందుకే వినాయక్ అయితేనే రీమేక్ కు పర్ఫెక్ట్ అని చిరు భావించాడు.
కాని లేటెస్ట్ న్యూస్ ప్రకారం వినాయక్ కూడా ఈ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. వినాయక్ కాదని చెప్పిన తర్వాత మెగా డైరక్టర్ హరీష్ శంకర్ చేతికి లూసిఫర్ రీమేక్ వచ్చిందట. అయితే హరీష్ శంకర్ కూడా ఈ సినిమా డైరెక్ట్ చేసేందుకు ఆసక్తి కనబరచలేదని అంటున్నారు. చిరంజీవి రీమేక్ సినిమా ఆఫర్ ఎవరికి చేతికి వెళ్తుందో చూడాలి.