
ధనుష్, సాయి పల్లవి జంటగా నటించిన మారి 2 సినిమాలో రౌడీ బేబీ సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. రౌడీ బేబీ సాంగ్ యూట్యూబ్ లో 1 బిలియన్ వ్యూస్ సాధించింది. బాలాజి మోహన్ డైరెక్ట్ చేసిన రౌడీ బేబీ సినిమాలో యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ ను ప్రభుదేవ మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్ 1 బిలియన్ వ్యూస్ సాధించినందుకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ లో కేవలం ధనుష్ ను మాత్రమే ఉన్నాడు. అయితే రౌడీ బేబీ సాంగ్ ఈ రేంజ్ లో హిట్ అవడానికి ప్రధాన కారణం సాయి పల్లవి ఆమె నటించిన ఫిదాలోని వచ్చిండే సాంగ్ కూడా యూట్యూబ్ లో క్రేజీ వ్యూస్ రాబట్టింది. రౌడీ బేబీ సాంగ్ కు సాయి పల్లవి కూడా చాలా ప్లస్ అయ్యింది. అలాంటిది 1 బిలియన్ పోస్టర్ లో సాయి పల్లవిని మిస్ చేయడం ఆమె ఫ్యాన్స్ ను హర్ట్ అయ్యేలా చేసింది. పోస్టర్ లో సాయి పల్లవి లేనందుకు ఆడియెన్స్ చిత్రయూనిట్ పై కామెంట్స్ చేస్తున్నారు.