కృతి శెట్టి కావాలంటే అంత ఇవ్వాల్సిందే..!

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కన్నడ భామ కృతి శెట్టి మొదటి సినిమా రిలీజ్ అవకుండానే వరుస అవకాశాలు అందుకుంటుంది. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న అమ్మడు ఆ తర్వాత నాచురల్ స్టార్ నానితో శ్యాం సింగ రాయ్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే మూడవ సినిమా ఛాన్స్ కూడా కొట్టేసింది. 

సుధీర్ బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. ఇక ఈ సినిమా తర్వాత మళయాళ మూవీ కప్పెల రీమేక్ లో కూడా కృతి ఛాన్స్ అందుకుందట. అయితే తన దగ్గరకు వచ్చే దర్శక నిర్మాతలకు రెమ్యునరేషన్ షాక్ ఇస్తుందట అమ్మడు. మొదటి సినిమాకు 40 లక్షలు తీసుకున్న కృతి శెట్టి నాని సినిమా నుండి తన రెమ్యునరేషన్ పెంచినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆమెతో సినిమా అంటే 70 లక్షలు కావాలని అంటుందట. కృతి శెట్టి డిమాండ్ చూస్తుంటే తెలుగులో టాప్ హీరోయిన్ అవడం పక్కా అనిపిస్తుంది.