
అక్కినేని కోడలు సమంత సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ లను చేస్తుంది. లేటెస్ట్ గా ఆహా కోసం ఓ టాక్ షో హోస్ట్ చేస్తుంది అమ్మడు. సామ్ జామ్ అంటూ వస్తున్న ఈ టాక్ షో కోసం స్టార్స్ కదిలి వస్తున్నారు. సమంత సామ్ జామ్ టాక్ షో మొదటి గెస్ట్ గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ అటెండ్ అయ్యాడు. తన ఇమేజ్ కు తగినట్టుగానే సమంత ఇంటర్వ్యూ ప్రశ్నలు.. వాటికి తగ్గ సమాధానాలు క్రేజీగా మారాయి.
ఇక సామ్ జామ్ లో సమంత చేసే రెండో ఇంటర్వ్యూ ఎవరిది అంటే ఇంకెవరికి మెగాస్టార్ చిరంజీవిదని తెలుస్తుంది. చిరుతో సమంత ఇంటర్వ్యూ ఊహించుకుంటేనే ఎక్సయిటింగ్ గా ఉంది. వెరైటీ కాన్సెప్ట్ తో వస్తున్న సామ్ జామ్ షో కోసం చిరు అటెండ్ అవుతున్నారు. వాటికి సమ్నందించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.