ఛత్రపతి సినిమా రీమేక్.. ఆ డైరక్టర్ నాట్ ఇంట్రెస్టెడ్..!

ప్రభాస్ కెరియర్ లో సూపర్ హిట్ అందుకున్న సినిమా ఛత్రపతి. రాజమౌళి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాతో ప్రభాస్ ఇమేజ్ డబుల్ అయ్యింది. ప్రభాస్ బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమా రీమేక్ లో నటిస్తారని తెలుస్తుంది. బాలీవుడ్ లో పాగా వేయాలని చూస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ డెబ్యూ మూవీగా ఛత్రపతి రీమేక్ అవుతుంది.

బాలీవుడ్ ఛత్రపతి సినిమాను సాహో ఫేమ్ సుజిత్ డైరెక్ట్ చేస్తారని వార్తలు వచ్చాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ తో సాహో సినిమా చేసిన సుజిత్ ఆ సినిమా కథ, కథనాలు ఎలా ఉన్నా టేకింగ్ విషయంలో సూపర్ అనిపించుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో లూసిఫర్ రీమేక్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్న సుజిత్ చివరి నిమిషంలో  ఆ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చాడు. ఛత్రపతి రీమేక్ ఛాన్స్ కు కూడా సుజిత్ నో చెప్పినట్టు టాక్. మరి హిందీ ఛత్రపతిని ఎవరు డైరెక్ట్ చేస్తారో తెలియాల్సి ఉంది.