ట్రెండింగ్ లో బిగ్ బాస్ అభిజిత్..!

బిగ్ బాస్ సీజన్ 4లో విజేత ఎవరన్నది ఇప్పుడిప్పుడే అంచనా వేస్తున్నారు. 11 వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 4 తెలుగులో ప్రస్తుతం 8 మంది హౌజ్ మేట్స్ ఉన్నారు. అయితే వీరిలో టాప్ 5 ఎవరు.. టాప్ 3లో ఎవరు ఉంటారు. విజేతగా ఎవరు నిలుస్తారు అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఎక్కువగా ఈ సీజన్ విన్నర్ అయ్యే ఛాన్స్ అభిజిత్ కు ఉన్నాయని అంటున్నారు. అతనితో పోటీగా అఖిల్, సోహెల్, అరియానా కూడా ఉన్నారు.

అయితే అభిజిత్ మైండ్ గేం ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో హీరోగా మారిన అభిజిత్ ఆ తర్వాత మిర్చిలాంటి కుర్రాడు సినిమా తీశాడు ఆ తర్వాత బిగ్ బాస్ లో కనిపించాడు. బిగ్ బాస్ లో అతనికి బాగానే క్రేజ్ వచ్చిందని చెప్పొచ్చు. 11 వారాల్లో 11 నామినేషన్స్ లో 9సార్లు అభిజిత్ నామినేట్ అయ్యాడు. అది కూడా అతన్ని ఆడియెన్స్ కు దగ్గరయ్యేలా చేసిందని అంటున్నారు. మరి ఫైనల్ విన్నర్ గా అభిజిత్ ఉంటాడా లేదా అన్నది తెలియాలంటే మరో నాలుగు వారాలు ఆగాల్సిందే.