
సుహాస్, చాందిని చౌదరి లీడ్ రోల్స్ లో సందీప్ రాజ్ డైరెక్ట్ చేసిన సినిమా కలర్ ఫోటో. ఆహాలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆహా ఓటిటిలో అందరు మెచ్చిన సినిమాగా కలర్ ఫోటో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమా అంతా ఒక ఎత్తైతే క్లైమాక్స్ ఒక ఎత్తు. అందరిని ఎమోషనల్ గా టచ్ చేసిన ఈ సినిమా ఆహాలో సూపర్ హిట్ అయ్యిందని తెలుస్తుంది.
థియేటర్ లో అయితే బ్లాక్ బస్టర్ అంటే ఆ సినిమాకు వచ్చే కలక్షన్స్ ను బట్టి చెప్పొచ్చు కాని ఓటిటిలో అదెలా చెబుతారు అంటే ఆ సినిమా చూసిన మినిట్స్ చూసి చెప్పొచ్చు. ఆహాలో కలర్ ఫోటో ఇప్పటికే 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వచ్చాయట. ఇది చూసి సినిమా ఏ రేంజ్ లో హిట్టయ్యింది అన్నది చెప్పొచ్చు. ఓ మంచి ప్రయత్నాన్ని అందరు ఎంకరేజ్ చేస్తారని మరోసారి ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది.