
కోలీవుడ్ హీరో సూర్య నటించిన సురరై పోట్రు సినిమా ఈమధ్యనే రిలీజైంది. సుధ కొంగర డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగులో ఆకాశం నీ హద్ధురా టైటిల్ తో వచ్చింది. అమేజాన్ ప్రైం లో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా చూసిన సెలబ్రిటీస్ సైతం సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సూర్య నటన, సుధ కొంగర డైరక్షన్ గురించి చెబుతున్నారు. ఇక ఈ లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ కూడా చేరారు.
సూర్య సినిమా చూసిన మహేష్ చిత్రయూనిట్ ను ప్రశంసించారు. సూర్య అద్భుతమా చేశారని అన్నారు. సుధ కొంగర డైరక్షన్ బాగుందని చెప్పారు. మహేష్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. టాలీవుడ్ స్టార్ హీరో కోలీవుడ్ స్టార్ హీరో సినిమాపై ప్రశంసలు కురిపించడం ఇద్దరి హీరోల ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
#SooraraiPottru 👏👏👏 What an inspiring film!! Brilliantly directed with amazing performances... @Suriya_offl in top form😎😎😎Shine on brother...🤗🤗🤗Congrats to the entire team👌👌👌@Aparnabala2 @Sudhakongara_of @gvprakash @nikethbommi