నాగ చైతన్య ఎట్టకేలకు పూర్తి చేశాడు..!

లాస్ట్ ఇయర్ మజిలీ, వెంకీమామ సినిమాలతో హిట్ అందుకున్న నాగ చైతన్య తన నెక్స్ట్ సినిమాను శేఖర్ కమ్ముల డైరక్షన్ లో లవ్ స్టోరీ అంటూ చేస్తున్నాడు. ఈ సినిమాలో చైతు సరసన ఫిదా భామ సాయి పల్లవి నటిస్తుంది. ఫిదా సినిమాను డైరెక్ట్ చేసిన శేఖర్ కమ్ముల మరోసారి సాయి పల్లవికి మంచి పాత్ర ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో చైతు, సాయి పల్లవిల జోడీ బాగుంటుందని అంటున్నారు.

కరోనా లాక్ డౌన్ కు ముందు కొంతభాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కరోనా లాక్ డౌన్ తర్వాత షూటింగ్ మొదలు పెట్టారు. ఇక నిజామాబాద్ లో చివరి సాంగ్ షూటింగ్ పూర్తి చేసుకుని గుమ్మడికాయ కొట్టారట చిత్రయూనిట్. ఈ సినిమాను 2021 మొదట్లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.