సామ్ జామ్.. ఆహాలో సమంత సర్ ప్రైజ్..!

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి తర్వాత డబుల్ ఎనర్జీతో పనిచేస్తుంది. సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ లను ఓకే చెప్పిన అమ్మడు లేటెస్ట్ గా ఆహా కోసం ఓ టాక్ షో చేస్తుందని తెలుస్తుంది. ఇంతకీ ఆ టాక్ షో టైటిల్ ఏంటో తెలుసా.. సామ్ జామ్.. సమంతతో పెట్టుకునే మాములుగా ఉండదు అంటూ లేటెస్ట్ గా ఓ టీజర్ వదిలారు. ఎప్పటిలానే సమంత ఈ ప్రోమోలో కూడా అలరించింది.

ఈమధ్యనే స్టార్ మాలో బిగ్ బాస్ హోస్ట్ గా వచ్చి సూపర్ అనిపించుకున్న అమ్మడు ఇక ఆహా కోసం టాక్ షోకి రెడీ అయ్యింది. సమంత చేసే సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ స్పెషల్ గా ఉండనున్నాయి. నవంబర్ 13 నుండే ఈ టాక్ షో ప్రారంభం అవుతుందని తెలుస్తుంది. మొత్తానికి అటు సినిమాలు ఇటు వెబ్ సీరీస్ లు.. మరో పక్క బిజినెస్ అక్కినేని ఫ్యామిలీకి పర్ఫెక్ట్ కోడలుగా సమంత అన్నిరంగాల్లో తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంది.