
మెగా బ్రదర్ నాగబాబు బర్త్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నాగబాబుకి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు అందచేశారు. విధేయుడు, ఎమోషనల్ పర్సన, దయగల హృదయం ఉన్న వ్యక్తే కాదు.. సరదాగా ఉండే వ్యక్తి.. నా సోదరుడు నాగబాబుకి పుట్టినరొజు శుభాకాంక్షలు అంటూ చిరు ట్వీట్ చేశారు. మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలానే కొనసాగాలని, నీ ప్రతి పుట్టినరోజుకి అది మరింత బలపడాలని ఆశిస్తున్నానని మెసేజ్ పెట్టారు చిరు. అంతేకాదు మెగా బ్రదర్స్ ముగ్గురు ఉన్న పిక్ ను కూడా షేర్ చేశారు.
చిరు పెట్టిన స్పెషల్ బర్త్ డే మెసేజ్ కు నాగబాబు కూడా తన స్పందన తెలియచేశారు. థ్యాంక్స్ అన్నయ్య.. నేనెప్పుడూ నీతోనే ఉంటాను అని రాసుకొచ్చారు. మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్, బండ్ల గణేష్ కూడా నాగబాబుకి బర్త్ డే విసెష్ చెప్పారు.
Happy Birthday to my passionately loyal, emotional, kind hearted and fun loving brother @NagaBabuOffl Have a great year ahead! మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని , నీ ప్రతి పుట్టినరోజుకి అది మరింత బలపడాలని ఆశిస్తున్నాను! pic.twitter.com/qswBwxgVfe