రామ్ 'రెడ్' బిజినెస్ అదిరింది..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న సినిమా రెడ్. కోలీవుడ్ లో సూపర్ హిట్టైన తడం సినిమా తెలుగు రీమేక్ గా రెడ్ సినిమా వస్తుంది. ఈ సినిమాలో రామ్ డ్యుయల్ రోల్ చేశాడు. ఈ సినిమాలో రామ్ సరసన అమృత అయ్యర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. కరోనా లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతపడగా అన్ లాక్ 5.0 లో థియేటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా థియేటర్ యాజమాన్యాలు అంత సాహసం చేయట్లేదు.  

అందుకే 2020 వదిలేసి 2021 సంక్రాంతికి రిలీజ్ లు ఫిక్స్ చేసుకుంటున్నారు. ఇప్పటికే సంక్రాంతికి రామ్ రెడ్ తో పాటుగా మరో మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. అయితే ఈ సినిమా థియేటర్ బిజినెస్ ఎలా ఉన్నా రెడ్ సినిమాకు థియేట్రికల్, శాటిలైట్ రైట్స్ మాత్రం భారీగానే డిమాండ్ చేశాయని తెలుస్తుంది. శాటిలైట్, డిజిటల్ రైట్స్ తోనే 14 కోట్ల దాకా నిర్మాతకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ తో హిట్ ట్రాక్ ఎక్కిన రామ్ రెడ్ తో సత్తా చాటాలని చూస్తున్నాడు. మరి అది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.