
బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు స్టిల్ బ్యాచిలర్ గానే ఉన్నాడు. ఏజ్ థర్టీ ప్లస్ వచ్చినా పెళ్ళిపై ఓ నిర్ణయానికి రావట్లేదు ప్రదీప్. లాస్ట్ ఇయర్ పెళ్ళిచూపులు అనే షో చేసి అందరి చేత చీవాట్లు తిన్న ప్రదీప్ త్వరలో పెళ్ళి చేసుకుంటాడని లేటెస్ట్ టాక్. ఓ రాయలసీమ పొలిటీషియన్ కూతురుని ప్రదీప్ పెళ్ళి చేసుకుంటున్నాడని టాక్. ఇప్పటికే మాట్లాడుకోవడం పూర్తయిందట.. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ అని అంటున్నారు. నిశ్ఛితార్ధ సమయంలోనే ప్రదీప్ ఈ విషయాన్ని రివీల్ చేయాలని చూస్తున్నాడట.
ప్రదీప్ పెళ్ళిపై ఈ క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ న్యూస్ గా మారింది. నిజంగానే ప్రదీప్ కి పెళ్ళి ఫిక్స్ అయ్యిందా లేదా అన్నది అతను మాట్లాడితేనే కాని తెలియదు. టివి ఆన్ చేస్తే ఏదో ఒక షోతో ఆడియెన్స్ ను అలరించే ప్రదీప్ ఓ ఇంటి వాడవుతుండటం అతని ఫ్యాన్స్ కు గుడ్ న్యూసే అని చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రదీప్ ఈటివి ఢీ ఛాంపియన్స్, జీ తెలుగు సరిగమప షోలకు యాంకరింగ్ చేస్తున్నాడు.