అక్కినేని కోడలు అసలు తగ్గట్లేదు..!

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ మాత్రమే ఇప్పుడు అక్కినేని కోడలు కూడా అందుకే సినిమాల సెలక్షన్ లో ఆచితూచి అడుగులేస్తున్న సమంత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే మొదట ప్రాధాన్యత ఇస్తుంది. రంగస్థలం లాంటి కమర్షియల్ సినిమాలో నటించి హిట్ అందుకున్నా ఆ తర్వాత యూ టర్న్, ఓ బేబీ అంటూ కొత్త ప్రయోగాలు చేసింది. ఈ ఇయర్ వచ్చిన జాను సినిమా కూడా సమంత ఫ్యాన్స్ ను అలరించింది. అయితే అది తమిళ సూపర్ హిట్ సినిమా 96 కు రీమేక్ అవడం వల్ల ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు.  

ఎలాంటి పాత్ర అయినా తన నటనతో మెప్పించే సమంత ఇప్పుడు సినిమా చేయాలంటే ఫుల్ డిమాండ్ చేస్తుందట. అంతకుముందు ఎలా ఉన్నా సమంత సినిమాలో ఉంది అంటే మినిమం గ్యారెంటీ అన్న నమ్మకం ఉంది. అందుకే సమంత పారితోషికం పెంచేసిందత. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం ప్రస్తుతం సమంత మూడున్నర కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తుందట. సమంత రెమ్యునరేషన్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అక్కినేని కోడలితో సినిమా చేయాలంటే మాత్రం ఆమె అడిగినంత ఇవ్వాల్సిందే అని అంటున్నారు.