కౌశల్ ఆవేశం.. నెటిజెన్లు ఫైర్..!

బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ మీద నెటిజెన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. బిగ్ బాస్ 2 సెన్సేషనల్ విన్నర్ గా కౌశల్ ఆర్మీ అంటూ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్న కౌశల్ చైనా మీద ప్రతికారం తీర్చుకోవాలన్న కోపంతో తన సెల్ ఫోన్ కిందకేసి పగలకొట్టాడు. అది కూడా బిగ్ బాస్ లో టాస్క్ చేసినందుకు వచ్చిందని తెలుస్తుంది.

చైనా మీద తన ఫ్రస్ట్రేషన్ ఇలా చూపించిన కౌశల్ మీరు ఇలా చేయాలని నేను చెప్పట్లేదని అన్నాడు. అయితే కౌశల్ చేసిన పనికి కౌంటర్లు పడుతున్నాయి. చైనా మీద పగ సాధించాలి అంటే ఉన్నవి పగలగొట్టడం కాదు ఆల్రెడీ ఈ ప్రొడక్ట్ కు సంబందించిన డబ్బులు వాళ్లకు చేరాయి.. కొత్తగా కొనకుండా ఉంటే బెటర్ అని కౌశల్ మీద నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.