హాట్ యాంకర్ రెడ్ వైన్ తాగుతుందట..!

తెలుగు బుల్లితెర మీద హాట్ యాంకర్ ఇమేజ్ తెచ్చుకున్న అనసూయ తన అందంతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఉదయభాను తర్వాత యాంకరింగ్ తో హాట్ ఇమేజ్ అందుకున్న ఈ భామ జబర్దస్త్ ను ఓ ఊపు ఊపేస్తుంది. అక్కడ కమెడియన్స్ చేసే కామెడీ షోతో పాటుగా అన్నసూయ అందాలను కూడా ఎంజాయ్ చేస్తారు ఆడియెన్స్. అందుకే ఆమెకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక ఆ క్రేజ్ తోనే సినిమాల్లో ఛాన్సులు కూడా అందుకుంటుంది. క్షణం సినిమా నుండి రంగస్థలం రంగమ్మత్త పాత్ర వరకు సిల్వర్ స్క్రీన్ పై నటనకు స్కోప్ ఉన్న రోల్స్ చేస్తుంది అనసూయ.   

ఇదిలాఉంటే ఎప్పుడు ట్విట్టర్ లో తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో టచ్ లో ఉండే అనసూయ లేటెస్ట్ గా మరోసారి తన అభిమానులతో చాట్ చేసింది. వాళ్లు అడిగిన చిలిపి ప్రశ్నలకు సమాధానం చెబుతూ తన బ్యూటీ టిప్స్ కూడా షేర్ చేసుకుంది. తను లైట్ ఫుడ్ తీసుకుంటానని.. హెవీ ఫుడ్ అసలే తినని చెప్పిన అనసూయ రాత్రి ఓ గ్లాస్ రెడ్ వైన్ తాగుతానని చెప్పింది. అది హెల్త్ కు మంచిదని డాక్టర్స్ కూడా చెబుతుంటారు అందుకే అది రోజు తాగుతా అంటుంది అనసూయ. మొత్తానికి మందు తాగే అలవాటు ఉందేమో అనుకుంటారని.. ఎంచక్కా నేను కేవలం వైన్ మాత్రమే తాగుతా అంటూ ముందే కవర్ చేసింది అనసూయ.