ఎమ్మెస్ ధోని హీరో.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య..!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. ముంబై బాంద్రాలోని తన నివాసంలో సుశాంత్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని బలవన్మరణం చెందినట్టు తెలుస్తుంది. 2008లో బుల్లితెర మీద ఓ సీరియల్ లో నటించిన సుశాంత్ ఆ సీరియల్ హిట్ అవడంతో సినిమా ఛాన్సులు అందుకున్నాడు. కై పో చెయ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ ఆ సినిమాతో అలరించగా శుద్ దేశి రొమాన్స్, ఎమ్మెస్ ధోని, కేథారనాథ్, చిచ్చోరె సినిమాల్లో నటించి మెప్పించాడు.      

కొన్నాళ్లుగా డిప్రెషన్ లో ఉంటున్న సుశాంత్ నాలుగు రోజుల క్రితం తన ఒకప్పటి మేనేజర్ దిశా సెలియన్ సూసైడ్ చేసుకోగా సుశాంత్ సూసైడ్ కు ఆమె కారణమై ఉంటుందా అన్న సందేహాలు వస్తున్నాయి. సుశాంత్ సూసైడ్ న్యూస్ బాలీవుడ్ ను షాక్ అయ్యేలా చేసింది. మంచి టాలెంట్ ఉన్న సుశాంత్ ఇంత త్వరగా తమని విడిచి వెళ్తాడని ఊహించలేదని బాలీవుడ్ సెలబ్రిటీస్ తమ స్పందన తెలియచేస్తున్నారు.