
సౌత్ సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ కారులో మందు సీసాలు దొరకడం హాట్ న్యూస్ గా మారింది. చెన్నైలోని ఈసీ రోడ్ ఆర్కా రోడ్ కానత్తూర్ సమీపంలో జరిగిన పోలీసుల వాహన తనిఖీలలో రమ్యకృష్ణకు చెందిన కారు లో భారీగా మందు బాటిల్స్ బయటపడ్డాయట. రమ్యకృష్ణ కారు డ్రైవర్ సెంథిల్ కుమార్ నడుపుతున్న వాహనంలో 96 బీరు బాటిల్స్, 8 లిక్కర్ బాటిల్స్ ఉన్నాయట. పోలీసులు రమ్యకృష్ణ డ్రైవర్ ను అదుపులో తీసుకున్నారు.
తమిళనాడులో కరోనా వీర విహారం చేస్తున్న టైంలో రమ్యకృష్ణ కారులో ఇలాంటి మందు సామాను దొరకడం షాకింగ్ గా మారింది. దీనిపై రమ్యకృష్ణ ఎలా రెస్పాండ్ అవుతుంది.. అసలు రమ్యకృష్ణ కారులో అంత పెద్ద మొత్తంలో మందు సామాను ఎక్కడికి.. ఎందుకు తీసుకెళ్తున్నారు. ఈ విషయంలో రమ్యకృష్ణ ఇన్వాల్వ్ మెంట్ ఎంతవరకు ఉంది అన్నది పోలీసుల విచారణలో తెలుస్తుంది.