బన్నితో స్ట్రాంగ్ మెసేజ్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. త్రివిక్రమ్ డైరక్షన్ లో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసింది. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. పుష్ప అంటూ మరో సంచలనానికి సిద్ధమయ్యాడు అల్లు అర్జున్. 

ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో బన్నీ సినిమా ఉంటుందని తెలుస్తుంది. రైటర్ నుండి డైరక్టర్ గా మారిన కొరటాల శివ.. తాను తీసే ప్రతి సినిమాలో సోషల్ మెసేజ్ ఇస్తున్నాడు. కమర్షియల్ సినిమాల్లో స్టార్స్ తో సోషల్ మెసేజ్ ఇస్తూ హిట్టు కొట్టడం అది కొరటాల శివ వల్లే అయ్యింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న కొరటాల శివ ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ తో మరో స్ట్రాంగ్ మెసేజ్ ఉన్న కంటెంట్ తో వస్తాడని తెలుస్తుంది. ఇప్పటికే బన్నీకి కథ చెప్పడం ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. మరి ఈ కాంబో ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో చూడాలి.