జనతా గ్యారేజ్: అక్కడ కాజల్ ఐటెం చేయదు

నిత్యా మీనన్, సమంతా ప్రధాన పాత్రలు పోషిస్తున్న జనతా గ్యారేజ్ సినిమాలో వారి కంటే చాలా సీనియర్ అయిన కాజల్ అగర్వాల్ ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకోవడం అంటే మామూలు విషయమేమీ కాదు. కానీ జూ.ఎన్టీఆర్ పట్టుబట్టడంతో ఒప్పుకొందని టాక్! కానీ ఒప్పుకొన్నాక తప్పు చేస్తున్నానేమోననే అనుమానం కలిగిందో ఏమో తెలియదు కానీ మూడు రోజులు షూటింగ్ లో పాల్గొన్న కుంటి సాకులు చెపుతూ జంప్ అయిపోయిందిట. ఇంతకీ ఏమి జరిగిందంటే తన అందాలని బయటపెట్టే తెల్లటి తడి బట్టలని ధరించనని కాజల్ ముందే ఓ కండిషన్ పెట్టిందిట. కానీ షూటింగులో అవే ఇచ్చేరుట! మొత్తం సాంగ్ లో నాలుగు జతలే మార్చేందుకు ఒప్పుకొంటే ఆ షరతుని కూడా దర్శకుడు కొరటాల శివ పట్టించుకోలేదుట. ఇంకా కొన్ని యాంగిల్స్ తన అందాలని చిత్రీకరించకూడదనే షరతుని కూడా దర్శకుడు పట్టించుకోలేదుట! అందుకే కాజల్ తన పెద్దపెద్ద కళ్ళతో దర్శకుడుని ఉరుమురిమి చూసి వెళ్లిపోయిందిట! ఆమె అవే సమస్యల కారణంగా వెళ్లిపోయిందో లేకపోతే సాటి హీరోయిన్ల ముందు ఐటెం చేయడం నామోషీగా భావించి వెళ్ళిపోయిందో తెలియదు. ఇప్పటికే కాజల్ ని దర్శక నిర్మాతలు పక్కనబెట్టి కొత్తగా వస్తున్న అమ్మాయిలని తీసుకొంటున్నారు. ఒకవేళ జనతా గ్యారేజీలో ఐటెం సాంగ్ హిట్ అయితే కాజల్ కి ఇక హీరోయిన్ ఆఫర్లు రావు ఐటెం సాంగులే వస్తాయి. అవే చేసుకోవలసి వస్తుంది. బహుశః ఆ భయంతోనే కుంటిసాకులు చెప్పి షూటింగ్ మధ్యలో పారిపోయిందేమో? కానీ జనతా గ్యారేజ్ లో అన్ని రకాల రిపేర్లు చేయబడతాయి కనుక మన కాజలమ్మకి కూడా ఏదోవిధంగా నచ్చజెప్పి ఐటెం చేయించడం తధ్యం. కానీ ఆ ఐటెం సాంగ్ హిట్ అయితేనే కాజల్ కి ట్రబుల్స్ మొదలవుతాయి కనుక వెనక్కి వస్తుందో లేదో చూడాలి