మహేష్ షర్ట్ లెస్ ఫోటో..!

సూపర్ స్టార్ మహేష్ 26 సినిమాల కెరియర్ లో ఎప్పుడూ షర్ట్ లెస్ గా కనిపించింది లేదు. సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన 1 నేనొక్కడినే సినిమాలోనే స్లీవ్ లెస్ టీ షర్ట్ లో కనిపించాడు తప్ప మరే సినిమాలో కూడా మహేష్ ఎక్స్ పోజ్ చేసింది లేదు. మిగతా స్టార్స్ అంతా సిక్స్ ప్యాక్ తో సత్తా చాటుతున్న టైంలో కూడా షర్ట్ విప్పకుండానే తన స్టామినా చూపించాడు మహేష్. అయితే ఈ లాక్ డౌన్ టైం లో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు సూపర్ ట్రీట్ ఇస్తూ మహేష్ షర్ట్ లెస్ ఫోటో ఒకటి లీక్ అయ్యింది.       

లీక్ అయ్యింది అని చెప్పడం కంటే మహేష్ భార్య నమ్రత షేర్ చేసింది అని చెప్పడం కరెక్ట్. తన గారాలపట్టి సితారతో మహేష్ స్విమ్మింగ్ పూల్ లో ఆడుకుంటున్న పిక్ షేర్ చేసింది నమ్రత. అందులో మహేష్ బేర్ చెస్ట్ ఫ్యాన్స్ ను షాక్ అయ్యేలా చేసింది. ఇక మహేష్ ను షర్ట్ లెస్ గా చూసిన కొందరు బోయపాటి, రాజమౌళి సినిమాల్లో మహేష్ షర్ట్ లెస్ గా కనిపించడానికి సిద్ధం అంటూ అప్పుడే వార్తలు రాసేస్తున్నారు. మొత్తానికి ఈ లాక్ డౌన్ టైం లో మహేష్ తన పిల్లలతో సరదాగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.