30 ఏళ్ల క్రితం మెగాస్టార్ పిక్.. ఫ్యాన్స్ ఖుషి..!

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాక చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. మెగా ఫ్యాన్స్ అందరికి రోజుకొక సర్ ప్రయిజ్ తో ఖుషి చేస్తున్నారు మన మెగాస్టార్. లేటెస్ట్ గా 30 ఏళ్ల క్రితం అమెరికాలో దిగిన ఓ పిక్ ను యాజిటీజ్ గా ఇప్పటి పిక్ కు జోడించి అప్పుడు.. ఇప్పుడు కాలం మారినా దేశం మారినా సేమ్ టూ సేమ్ అంటూ ఫోటో షేర్ చేశారు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. 

సైరా సక్సెస్ తర్వాత ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్ లో ఆచార్య సినిమా చేస్తున్నాడు చిరంజీవి. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి నిర్మిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ గా కాజల్ నటిస్తుండగా మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. 2021 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఎలాగూ ఆ డేట్ కు రిలీజ్ ప్రకటించిన ఆర్.ఆర్.ఆర్ వాయిదా పడే అవకాశాలే కనిపిస్తున్నాయి అందుకే ఆచార్యని ఆ టైం కు రిలీజ్ ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారు.