అభిమానులకు ఎన్టీఆర్ ఓపెన్ లెటర్..!

మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఆర్.ఆర్.ఆర్ నుండి స్పెషల్ అప్డేట్ వస్తుందని ఆశించిన నందమూరి ఫ్యాన్స్ కు నిరాశ మిగిలేలా ఉంది. అనుకున్నట్టుగానే ట్రిపుల్ ఆర్ చిత్రయూనిట్ ఎన్టీఆర్ బర్త్ డే రోజు ఎలాంటి టీజర్ రిలీజ్ చేయట్లేదని వెళ్లడించారు. ఈ ఎనౌన్స్ రావడమే ఆలస్యం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆర్.ఆర్.ఆర్ టీం పై కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. వారిని శాంతింపచేయడానికి తారక్ తన అభిమానుల కోసం ఒక ప్రకటన ఇచ్చాడు. 


ప్రస్తుతం లాక్ డౌన్ టైం లో మీరంతా సంతోషంగా ఉన్నారని ఆశిస్తున్నా అంటూ ఆర్.ఆర్.ఆర్ నుండి ఎలాంటి టీజర్ రావట్లేదని.. దానికి నిరాశ చెందవద్దని ఫ్యాన్స్ ను కోరాడు ఎన్టీఆర్. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా సంచలనం కాబోతుందని మాత్రం ఎన్టీఆర్ హామీ ఇచ్చారు. పుట్టినరోజు పండుగ జరుపుకునే ఛాన్స్ లేకున్నా పండుగ లాంటి వార్త చెప్పాడు తారక్.