
సాహో తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. రాధాకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ తర్వాత నాగ్ అశ్విన్ డైరక్షన్ లో ఇంటర్నేషనల్ రేంజ్ సినిమా చేస్తున్నాడు. అశ్వనీదత్ నిర్మాణంలో తెరకెక్కే ఈ సినిమా భారీ బడ్జెట్ తో వస్తుందని తెలుస్తుంది. సైన్స్ ఫిక్షన్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో విలన్ గా రానా నటిస్తాడని ఫిలిం నగర్ టాక్.
ఆల్రెడీ బాహుబలి సినిమాలో ఈ ఇద్దరు పోటాపోటీగా నటించి మెప్పించారు. అమరేంద్ర బాహుబలి, భళ్లాలదేవ పాత్రల్లో ప్రభాస్, రానా అభినయించిన తీరు సినీ ప్రియులను అలరించింది. అయితే మరోసారి ఈ ఇద్దరు నువ్వా నేనా అనేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది. నాగ్ అశ్విన్ హీరో పాత్రతో పాటుగా అందుకు తగినట్టుగానే విలన్ రోల్ రాసుకున్నాడట. ఆ పాత్రలో రానా అయితేనే పర్ఫెక్ట్ అని చిత్రయూనిట్ భావిస్తున్నారట. ప్రభాస్, రానా ఇద్దరు మళ్ళీ సినిమా అంటే ఇక ఆ అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవడె సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలతో సత్తా చాటిన దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాతో ఎలాంటి హిట్టు కొడతాడో చూడాలి.